దసరా పండుగ, వారాంతపు సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. జాతీయ రహదారి 65పై పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరడంతో రాకపోకలు నెమ్మదించాయి. ట్రాఫిక్ పోలీసులు లక్కారం–వలిగొండ–చిట్యాల మార్గంలో వాహనాలను మళ్లిస్తున్నారు. మరోవైపు జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లలో రద్దీ పెరిగింది. ప్రయాణికుల అవసరాల కోసం ఆర్టీసీ 7 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నగర శివారు ప్రాంతాల నుంచి కూడా సర్వీసులు ఏర్పాటు చేయగా.. ప్రత్యేక బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సదుపాయం వర్తిస్తోంది.


