హైదరాబాద్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్, సంజీవయ్య పార్క్ పరిసరాల్లో నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఈ మార్గాలకు వెళ్లే రోడ్లలో ప్రయాణించే వాహనాలను ప్రత్యామ్నాయ దారుల్లోకి మళ్లించనున్నారు. కొన్ని మార్గాల్లో విగ్రహాల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.


