HomeLifestyleషుగర్‌ తగ్గించే దివ్యౌషధం పొడపత్రి ఆకు, దీనిని ఎలా ఉపయోగించాలంటే?

షుగర్‌ తగ్గించే దివ్యౌషధం పొడపత్రి ఆకు, దీనిని ఎలా ఉపయోగించాలంటే?

మధుమేహం లేదా షుగర్‌ వ్యాధి అనేది నేటి ఆధునిక జీవనశైలిలో సర్వసాధారణమైన ఆరోగ్య సమస్యగా మారింది. మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఒత్తిడి వల్ల అనేక మంది షుగర్‌ వ్యాధి బారిన పడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి రసాయన మందులతో పాటు సహజసిద్ధమైన ఆయుర్వేద మూలికలను ఉపయోగించడం ఎంతో శ్రేయస్కరం. అలాంటి శక్తివంతమైన ఆయుర్వేద మూలికల్లో పొడపత్రి అత్యంత ముఖ్యమైనదిగా చెప్పొచ్చు.

పూర్వకాలం నుంచి మన భారతీయులు షుగర్ నివారణకు ఈ ఆకులను ఒక దివ్యౌషధంగా ఉపయోగిస్తున్నారు. హిందీలో దీనిని గుడ్‌మార్‌ అని పిలుస్తారు. అంటే తీపిని నాశనం చేసిది అని అర్థం. ఇది కేవలం చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని CTMP అధ్యయనం పేర్కొంది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ అద్భుతమైన పొడపత్రి ఆకుల ప్రాముఖ్యత, వాటిని ఉపయోగించే సరైన విధానం గురించి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments