వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ చిత్రం నుంచి తాజాగా ‘నారాయణమ్మ’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం వెంకటేష్ నటించిన ‘పవిత్ర బంధం’ చిత్రంతోనే మొదలైందని, ఆయన పట్ల ఎప్పుడూ గౌరవంతో కూడిన భయం ఉంటుందని తెలిపారు. ఇక వెంకటేష్ మాట్లాడుతూ.. 20 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి సరికొత్త కథతో రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
‘వెంకటేష్ అంటే నాకు భయం.. అది గౌరవంతో కూడిన ఇష్టం వల్ల వచ్చింది’.. త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
RELATED ARTICLES


