HomeAndhra Pradeshరూ.7 కోసం కక్కుర్తిపడ్డ షాపు యజమాని.. ఏకంగా రూ.7 లక్షల జరిమానా, వాటర్ బాటిల్‌ కారణంగా...

రూ.7 కోసం కక్కుర్తిపడ్డ షాపు యజమాని.. ఏకంగా రూ.7 లక్షల జరిమానా, వాటర్ బాటిల్‌ కారణంగా కష్టాలు

Kakinada Consumer Commission Fined Shopkeeper Rs 7 Lakhs: కాకినాడ జిల్లాలో వాటర్‌బాటిల్‌ను ఎమ్మార్పీకి మించి విక్రయించిన షాపు నిర్వాహకుడికి వినియోగదారుల ఫోరం షాక్‌ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న అన్నవరం ఆలయానికి వెళ్లిన భక్తుడు ఓ షాపులో వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేశాడు. ఎమ్మార్పీ రూ.18 ఉంటే రూ.25 తీసుకోవడంతో ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. భక్తుడి నుంచి అదనంగా వసూలు చేసిన ఏడు రూపాయలు, కోర్టు ఖర్చుల కింద రూ.10వేలు, రూ.5వేలతో పాటుగా వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.7లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments