అమెరికాలోని విశ్వవిద్యాలయాలు జే-1, ఓపీటీ ఉద్యోగులను వాడుకుంటూ స్థానిక అమెరికన్ల ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తున్నాయా అనే కోణంలో విచారణ జరిపేందుకు కార్మిక శాఖ సమాయత్తమవుతోంది. ఇది ఎఫ్-1, జే-1 వీసాలపై ఉన్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై నేరుగా ప్రభావం చూపే అవకాశముంది.


