తెలంగాణలో కులగణన వివరాల్లో తేడాలున్నాయని భావించే వారు తమ సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అవసరమైతే గణాంకాలను సవరించి.. నమోదు కాని కుటుంబాల వివరాలను చేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలోకి మార్చాలన్న డిమాండ్‌పై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ అంశంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉందని తెలిపారు.


