ఇరాన్‌ను బెదిరింపులు, ఒత్తిళ్లతో దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలించబోవని ఆ దేశ అధ్యక్షుడు తేల్చి చెప్పారు. అమెరికా గడ్డపైనే ట్రంప్ గాలి తీసేసిన మసూద్ పెజిష్కియాన్.. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అంతేకాదు, తమను ఉగ్రవాదులని ముద్రవేస్తోన్న ట్రంప్‌నకు చెప్పేది ఒకటేనని, తామే అమెరికా చేతుల్లో ఉగ్రవాద బాధితులమని ఐరాస సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.
బెదిరింపులు పెంచేకొద్దీ మా ప్రతిఘటన పెరుగుతుంది.. అమెరికా గడ్డపైనే ట్రంప్ గాలితీసేసిన ఇరాన్ అధ్యక్షుడు
RELATED ARTICLES


