గుంటూరుకు చెందిన పదో తరగతి చదువుతున్న ఓ బాలిక మూడు నెలల కిందట అదృశ్యమైంది. తమ కూతురును ఒక వ్యక్తి ఇన్స్టాలో ట్రాప్ చేసి తీసుకెళ్లాడంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ కనిపించకపోవడంతో నేరుగా హైకోర్టుకు వెళ్లారు. అక్కడ వాదనలు విన్న న్యాయస్థానం గుంటూరు పోలీసులకు చీవాట్లు పెట్టింది. గుంటూరు పోలీసులు గ్రేట్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేసి గురువారంలోగా బాలిక ఎక్కడ ఉందో కనిపెట్టి తీసుకురావాలి అంటూ నేరుగా డీజీపీకే ఆదేశాలు జారీ చేసింది.
బాలిక మిస్సింగ్ కేసు.. గుంటూరు పోలీసులను ఏకిపారేసిన హైకోర్టు.. అబ్బబ్బా చాలా గ్రేట్ అంటూ వ్యంగ్యాస్త్రాలు!
RELATED ARTICLES


