
సిద్దిపేట:
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంపూర్ గ్రామంలో సంచలన డిజిటల్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బతికున్న 22 మంది గ్రామస్థులను చనిపోయినట్లు చూపిస్తూ నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు.రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి భుక్య మధు తన అధికారిక ఈ-సైన్ డాంగిల్ కీని అదే గ్రామానికి చెందిన ప్రైవేట్ వ్యక్తి షేవల్ల రమేష్ కు అప్పగించారు. హైదరాబాద్లో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్న రమేష్ ఆ లాగిన్ ఆధారంగా ఈ స్కామ్ కు తెరలేపాడు.2026 ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ వరకు 22 మంది బతికున్న వ్యక్తుల పేర్లతో నకిలీ డెత్ సర్టిఫికెట్లు జారీ చేశాడు.వారి పేర్లపై ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా లక్షలాది రూపాయల క్లెయిమ్ సొమ్ము కాజేసేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.పంచాయతీ కార్యదర్శి భుక్య మధు, షేవల్ల రమేష్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఇన్సూరెన్స్ ఏజెంట్లు లేదా ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.


