Bajaj Finance FD Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన క్రమంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి శుభవార్తలు అందుతున్నాయి. కార్పొరేట్ సంస్థ బజాజ్ ఫైనాన్స్ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచుతూ ప్రకటన చేసింది. సీనియర్ సిటిజన్లకు ఏకంగా 8.15 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. మరి ఇందులో రూ.5 లక్షలు జమ చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత ఎంతొస్తుంది? ఆ వివరాలు తెలుసుకుందాం.


