HomeAndhra Pradeshప్రభుత్వ వైద్యకళాశాలల్లో 161 కొత్త పీజీ సీట్లు మంజూరు

ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 161 కొత్త పీజీ సీట్లు మంజూరు

ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 161 కొత్త పీజీ సీట్లు మంజూరు

11 కళాశాలల్లో 15 విభాగాలకు ఎన్ఎంసీ అనుమతి.. ఆర్థోపెడిక్స్‌లో అత్యధికంగా 27 సీట్లు

రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి 15 వైద్య విభాగాలకు కొత్తగా 161 పీజీ సీట్లను జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) మంజూరు చేసింది.ఆర్థోపెడిక్స్‌లో అత్యధికంగా 27 సీట్లు మంజూరయ్యాయి. చర్మ, సుఖవ్యాధుల విభాగం, ఈఎన్టీ, పాథాలజీ విభాగాలకు 16 చొప్పున, రేడియో డయాగ్నసిస్‌కు 14, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ విభాగాలకు 12 చొప్పున మంజూరయ్యాయి.జనరల్ మెడిసిన్, ఎనస్థీషియాలజీ, ఆఫ్తల్మాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్ విభాగాలకు 8 చొప్పున, ఎమర్జెన్సీ మెడిసిన్, ప్రసూతి-గైనకాలజీ, సైకియాట్రీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలకు 4 చొప్పున సీట్లు మంజూరయ్యాయి.ప్రస్తుతం మంజూరైన 161 సీట్లను 2026-27 విద్యా సంవత్సరం పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు.వైద్యశాలల్లో ఎన్ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగా బోధన సిబ్బంది నియామకాలు, పడకల పెంపు, వైద్య పరికరాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చొరవ చూపడంతో అదనపు సీట్ల మంజూరు సాధ్యమైందని పేర్కొన్నారు.

PGSeats #MedicalColleges #NMC #DME

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments