HomeTELANGANAప్రధాని మోదీ 56 అంగుళాల ఛాతీ ధైర్యాన్ని మరోసారి చూపించాలి.. ఎలాన్ మస్క్ వివాదంపై ఓవైసీ...

ప్రధాని మోదీ 56 అంగుళాల ఛాతీ ధైర్యాన్ని మరోసారి చూపించాలి.. ఎలాన్ మస్క్ వివాదంపై ఓవైసీ వ్యాఖ్యలు

ప్రధాని మోదీతో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దేశం విషయంలో రాజీపడబోనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. టెలికాం మార్కెట్‌, స్టార్‌లింక్‌ సేవల అనుమతులపై ఎలాన్ మస్క్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. దేశ వనరులను ఎలా వినియోగించుకోవాలి.. విదేశీ సంస్థలకు ఎలాంటి అనుమతులు ఇవ్వాలనే నిర్ణయాలు భారతదేశమే తీసుకోవాలని ఒవైసీ పేర్కొన్నారు. మన దేశంలో మొబైల్ డేటా ధరలు తక్కువగా ఉన్నాయని గుర్తుచేస్తూ.. విదేశీ వ్యాపార ప్రయోజనాల కంటే దేశ ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తన ధైర్యాన్ని చూపించాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments