ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసే వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలని నేషనల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సూచిస్తోంది. సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువగా పోర్న్ యాప్‌ల ప్రకటనలే కనిపిస్తున్నాయి. ఒకవేళ పొరపాటున ఆ పోర్న్ యాడ్‌పై క్లిక్ చేస్తే.. ప్రమాదకర మాల్వేర్ సెల్ఫోన్లలోకి చొరబడుతుందని ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ హెచ్చరించింది. నైట్ ప్లే, రీలూప్, కిస్, విమో, రివో, నెక్సో, విక్సా వంటి యాప్‌లు సోషల్ మీడియా యాడ్స్ నుంచి అశ్లీల కంటెంట్‌ను అందించే వెబ్సైట్లకు మళ్లిస్తాయి అని ఇండియన్ సైబర్ క్రైమ్ కో – ఆర్డినేషన్ సెంటర్లో పనిచేసే అనలిటిక్స్ యూనిట్ ఫోన్ యూజర్లను హెచ్చరించింది.
పోర్న్ యాప్‌లు ఇన్స్టాల్ చేశారా.. అయితే, మీ డేటా మొత్తం హ్యాక్ అయినట్టే, నేషనల్ సైబర్ సెక్యూరిటీ వార్నింగ్!
RELATED ARTICLES


