ఈ రోజుల్లో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ సమస్యతో సఫర్ అవుతున్నారు. సాధారణంగా జీర్ణక్రియలో భాగంగా మన శరీరంలో గ్యాస్ ఏర్పడుతుంది. ఇది తేన్పుల ద్వారా పైకి లేదా అపానవాయువు (Farting) ద్వారా కిందకు బయటకు వెళ్లిపోతుంది. కానీ కొన్నిసార్లు ఈ గ్యాస్ పేగుల మలుపుల వద్ద లేదా పొట్టలో ఇరుక్కుపోయి బయటకు రాలేకపోతుంది. దాన్నే “ట్రాప్డ్ గ్యాస్” అంటారు. కడుపు లేదా పేగుల్లో గ్యాస్ పేరుకుపోయినప్పుడు, అది జీర్ణవ్యవస్థ గోడలను సాగదీస్తుంది (stretch చేస్తుంది).
పేగుల్లో ఉండే సున్నితమైన నరాల మీద ఈ ఒత్తిడి పడటం వల్ల తీవ్రమైన, మెలిపెట్టినట్లు లేదా గుచ్చినట్లు ఉండే నొప్పి వస్తుంది. కొన్నిసార్లు ఈ నొప్పి ఛాతీ, వీపు లేదా పక్కటెముకల భాగంలో కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. అసలు గ్యాస్ ఎందుకు పేరుకుపోతుంది, గ్యాస్ చిక్కుకుపోయినప్పుడు నొప్పి ఎందుకు వస్తుంది? ఇలా పూర్తి వివరాల్ని డాక్టర్ అనుపమ ఎన్.కె (సీనియర్ కన్సల్టెంట్ – మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆస్టర్ CMI హాస్పిటల్, బెంగళూరు) అందించారు.


