నేపాల్ ఆకస్మిక వరదల కారణంగా బీహార్లోని గండ్లక్ నది సహా పరివాహక ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అయితే ఈ వరద నీటితో పాటు ఈ నదిలోకి విచిత్రమైన, గుర్తు తెలియని చేపలు కూడా కొట్టుకొచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న బీహార్ సర్కారు.. వెంటనే స్పందించింది. పశ్చిమ చంపారన్, గోపాల్గంజ్ జిల్లాల ప్రజలు ఆ వింత చేపలను తినడం లేదా విక్రయించడం చేయవద్దని మత్స్య శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. కలుషిత నీటిలో కొట్టుకొచ్చిన ఈ చేపల్లో హానికర బ్యాక్టీరియా, వైరస్లు ఉండే ప్రమాదం ఉన్నందున.. అధికారుల ధృవీకరణ వచ్చే వరకు వీటికి దూరంగా ఉండాలని ఆదేశించింది.
“నేపాల్ వరదలతో కొట్టుకొచ్చిన ఆ వింత చేపలు తినొద్దు, అమ్మొద్దు”: బీహార్ సర్కార్ సంచలన హెచ్చరిక
RELATED ARTICLES


