ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు జోసెఫ్ విజయ్ పార్టీ అనూహ్య విజయం అందుకుంది. రాజకీయ వర్గాలను ఈ విజయం విస్మయానికి గురిచేసింది. అయితే, విజయ్ గెలుపు వెనుక ఆయన అభిమాన సంఘం కీలక పాత్ర పోషించింది. విజయ్ ఎన్నికల్లో గెలుపు తమిళనాడు సినీ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తాజాగా, ప్రముఖ నటుడు ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో టీవీకే స్పందించింది.


