ప్రతిరోజూ మీ శరీర బరువులో అధిక భాగాన్ని మోకాళ్ళు మోస్తాయి. అంతేకాకుండా, నడవడానికి, మెట్లు ఎక్కడానికి, కూర్చోవడానికి , నిలబడడానికి కూడా మోకాళ్ళు సాయపడతాయి. ఇలా అవి నిరంతరం కష్టపడతాయి. దీంతో కీళ్లపై అదనపు ఒత్తిడి పడి ఎఫెక్ట్ అయి మోకాళ్ల నొప్పులు వస్తాయి.
మోకాలి సమస్యలు అనేవి వయసు పెరగటం, గాయం వల్లే రాదు. దీనికి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎన్నో కారణాలు ఉంటాయి. మనం నడిచే విధానం దగ్గర్నుంచీ వర్కౌట్ చేసే విధానం వరకూ ప్రతీ ఒక్కటి నొప్పుల్ని పెంచుతాయి. ఇవి మనకి చిన్న కారణాలుగానే కనిపించినప్పటికీ లోలోపలే మోకాళ్లని డ్యామేజ్ చేస్తాయి. పదే పదే మోకాళ్లపై భారం వేయడం, ఎక్కువసేపు కదలకుండా ఉండడం, సరైన కదలిక పద్ధతులని పాటించకపోవడం వంటివి కీళ్ళు బిగుసుకుపోవడం, కండరాల బలహీనత, కీళ్ల అసౌకర్యానికి దారితీస్తాయి. ఇవన్నీ కూడా మోకాళ్లని దెబ్బతీయకపోవచ్చు. కానీ, సమస్యకి మాత్రం కారణంగా ఉంటాయి. దీంతో పాటు మరికొన్ని అలవాట్లు కూడా సమస్యని పెంచుతాయి.