రోజులు మారే కొద్దీ రకరకాల హెయిర్‌స్టైల్స్ వచ్చాయి. వీటిని అందంగా కనిపించేందుకు రకరకాల హెయిర్ క్లిప్స్, క్లచర్స్ వచ్చాయి. అయితే, అన్నీకూడా జుట్టుని స్టైల్‌గా కనిపించేందుకు మాత్రమే కాదు. మన కన్వీనియెన్స్ కూడా ఉపయోగపడేవే. జుట్టుని వదిలేయకుండా ముడివేయడానికి చక్కగా స్టైల్ చేయడానికి హెయిర్ క్లిప్స్ వాడుతుంటారు. అయితే, ఇందులో క్లా క్లిప్స్, క్లచర్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా జుట్టుని హాఫ్ పార్టిషన్ చేయడానికి లేదా జడ వేసుకున్నాకూడా పెట్టుకోవడం, కాస్తా పెద్దవైతే మొత్తం జడని ముడి వేయడానికి వాడుతుంటారు. అయితే, ఇవన్నీ మనకి ఎంత కన్వీనియెంట్గా ఉంటాయో అన్నీ హెయిర్ ప్రాబ్లమ్స్‌కి కూడా కారణమవుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. వీటిని వాడడం వల్ల కొన్నిసార్లు జుట్టు బ్రేక్ అవ్వడం దగ్గర్నుంచీ ప్రమాదాలు జరిగి ప్రాణాల మీదకే వస్తున్నాయని చెబుతున్నారు. ఆ సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాలేంటో ఇప్పుడు చూద్దాం.


