పిల్లల ఇంటర్నెట్ వినియోగాన్ని నిషేధించాలనే ఆలోచనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంటర్నెట్ వినియోగం అనేది ప్రతి ఒక్కరి హక్కు అని, వయస్సు రీత్యా చిన్నారుల నెట్ వినియోగంపై నిషేధం విధించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. పైగా బ్యాన్ చేయడం సరైన పరిష్కారం కాదని తెలిపింది. దానికి బదులు మెరుగైన ప్రైవసీ సెట్టింగ్స్, పేరెంటల్ కంట్రోల్స్ ఉండేలా సోషల్ మీడియా ఖాతాలలో ‘చైల్డ్ మోడ్’ తీసుకురావాలని సూచించింది. కాగా మన దేశంలో పిల్లల ఆన్లైన్ సెక్యూరిటీ, డేటా రక్షణ కోసం ఇప్పటికే నాలుగు చట్టాలు ఉన్నాయి.


