న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు భారత వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ కుడి తొడ కండరాల గాయం కారణంగా దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో ఇషాన్ ఈ గాయానికి గురైనట్లు బీసీసీఐ ధృవీకరించింది. దీంతో శనివారం జరిగే రెండో మ్యాచ్‌లో అతడి స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని మ్యాచులుగా వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు.


