HomeHeadlinesఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు .. నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతి అభివృద్ధికి భారీ...

ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు .. నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతి అభివృద్ధికి భారీ నిధులు

సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాలుగు ప్రధాన సిటీల్లో కొత్తగా పోలీస్ కమిషనర్ ఆఫీసులను ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనుల కోసం రూ.2800 కోట్లకుపైగా నిధుల కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ మంత్రి వర్గ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments