ఎల్బీనగర్-హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానానికి కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జి.. హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ వంటి ప్రతిపాదనలపైనా కేంద్రంతో తెలంగాణ సర్కార్ చర్చించింది. రోప్‌వేలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, గ్రీన్‌ఫీల్డ్ హైవే, రాష్ట్ర రహదారుల అప్‌గ్రేడేషన్ వంటి అంశాలు కూడా ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టులు అమలైతే ప్రయాణ సౌకర్యాలు, రవాణా సామర్థ్యం, పర్యాటక అనుసంధానం మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.


