ఉప్పాడ తీర ప్రాంత ప్రజల ఏళ్ల నాటి కల నెరవేరనుంది. ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పర్యవేక్షణలో ఐఐటీ మద్రాస్ బృందం సర్వే ప్రారంభించింది. తీర ప్రాంతం వెంబడి ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం డ్రోన్ సర్వే నిర్వహించింది. అత్యాధునిక సాంకేతికతతో బీచ్ ప్రొఫైల్, తీరాల మ్యాపింగ్ చేపట్టింది. తీరం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాల సేకరణ, పరీక్షలు నిర్వహించారు. అధ్యయనం పూర్తయిన అనంతరం రక్షణ గోడ అలైన్‌మెంట్‌పై కసరత్తు చేయనున్నారు. మరోవైపు డిజైన్, డీపీఆర్‌తో పాటు సమాంతరంగా పర్యావరణ అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఉప్పాడ: తీరనున్న దశాబ్దాల కల.. రంగంలోకి దిగిన మద్రాస్ ఐఐటీ..
RELATED ARTICLES


