Microsoft VP Kesavan Shanmugam: మల్టీనేషనల్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి కుటుంబం కోసం ఉద్యోగం వదిలేశారు అంటే ఆశ్చర్యమే కదా. కెరీర్ కంటే ఫ్యామిలీనే ముఖ్యం అంటూ మైక్రోసాఫ్ట్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ కేవన్ షణ్ముగం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇండియా తిరిగి వచ్చేసి యావత్ టెక్ పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేశారు. 23 ఏళ్లుగా అంచలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత కుటుంబం కోసం మానేయడం అంటే అంత సులభం కాదనే చెప్పాలి. ఆయన నిర్ణయం గురించిన వివరాలు తెలుసుకుందాం.


