ప్రధాని మోదీకి కేంద్రమంత్రి బండి సంజయ్.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మోదీతో తనకు ఎదురైన ఓ వ్యక్తిగత అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుని ఎమోషనల్ అయ్యారు. తాను అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో మోదీ తనను పలకరించారని గుర్తు చేసుకున్నారు. తాను ఉన్న పరిస్థితుల్లో ప్రధాని మాట్లాడిన ఆ నాలుగు పదాలు తనకు ఎంతో విలువైనవని, వాటిని ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. కార్యకర్తల పరిస్థితులను గమనించే వ్యక్తిగా మోదీని బండి సంజయ్ అభివర్ణించారు.


