HomeHeadlinesఅమెరికాలో కొత్త ఉదయం - మమ్దానీ ప్రసంగానికి ప్రపంచవ్యాప్తంగా స్పందన

అమెరికాలో కొత్త ఉదయం – మమ్దానీ ప్రసంగానికి ప్రపంచవ్యాప్తంగా స్పందన

అమెరికాలో కొత్త ఉదయం – మమ్దానీ ప్రసంగానికి ప్రపంచవ్యాప్తంగా స్పందన

శ్రామిక ప్రజల ఆకాంక్షలే ఎన్నికల ఫలితాలను నిర్ణయించాయన్న మమ్దానీ

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ సాధించిన విజయానంతరం జోహ్రాన్ మమ్దానీ చేసిన ప్రసంగం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. శ్రామిక ప్రజల సమస్యలు, ధరల పెరుగుదల, సంపన్నుల ఆధిపత్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

వేచి చూసే ఓపిక లేదు:
శ్రామిక ప్రజలు తమ ప్రభుత్వం నుంచి మరింత ఆశిస్తున్నారని, నిన్నటి ఎన్నికలు స్పష్టం చేశాయని మమ్దానీ అన్నారు. ఇక వేచి చూసే ఓపిక వారికేమాత్రం లేదని స్పష్టం చేశారు.హామీలను నెరవేర్చడానికి మరికొన్నేళ్ల సమయం కావాలని జేడీ వాన్స్ అడిగారని, కానీ ఈ నెలలోనే చెల్లించాల్సిన ఇంటి అద్దె, పిల్లల సంరక్షణ ఖర్చులు, కుటుంబానికి కావాల్సిన నిత్యావసర వస్తువుల కోసం శ్రామిక ప్రజలు మరో రెండేళ్లు వేచి ఉండలేరని పేర్కొన్నారు.

సంపన్నులపై విమర్శలు:
ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా ఎదుగుతుంటే, మరోవైపు సామాన్యులకు సరిపడా వనరులు లేవని చెప్పడం వినీ వినీ ప్రజలు అలిసిపోయారని అన్నారు. డేటా సెంటర్ల నిర్మాణం కోసం తమ భూములను, నీటి వనరులను ప్రజలే త్యాగం చేయాలని చెప్పడాన్ని వారు అంగీకరించడం లేదని తెలిపారు.ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న రాజకీయ నాయకులు, సామాన్య ప్రజల అవసరాలు తీర్చడం అసాధ్యమనీ, వారి కోరికలు ఆచరణ సాధ్యం కానివని చెప్పడం పట్ల ప్రజలు విసిగిపోయారని మమ్దానీ విమర్శించారు.

ప్రజల తిరుగుబాటు:
“తక్కువగా కోరుకోండి, అంతకంటే తక్కువే ఆశించండి” అనే ధోరణిని ప్రజలు ఇక సహించలేకపోతున్నారని, అందుకే ఎన్నికల్లో అన్యాయాన్ని ఎదిరించి నిలబడ్డారని పేర్కొన్నారు.పన్నుల ద్వారా వచ్చిన డబ్బును పాఠశాలలు నిర్మించడానికి, రహదారులు వేయడానికి ఉపయోగించాల్సింది పోయి, యుద్ధ నేరాలకు, మారణహోమాలకు ఖర్చు చేస్తున్న రాజకీయ నాయకులను వారు నిలదీశారని అన్నారు.

డబ్బుతో ఎన్నికలు కొనలేరు:
ఈ ఎన్నికలను డబ్బుతో కొనేయొచ్చని, వందల మిలియన్ల డాలర్లు ఖర్చు చేసినా, ఆ ప్రయత్నాలన్నింటినీ ప్రజలు తిప్పి కొట్టారని చెప్పారు. మనందరినీ ఒక్కటి చేస్తున్న నిత్యావసరాల ధరల సంక్షోభానికి ముగింపు పలకాలని వారు డిమాండ్ చేశారని తెలిపారు.అధికారాన్ని గెలుచుకోవడం మాత్రమే సరిపోదని, ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని మమ్దానీ స్పష్టం చేశారు. డొల్ల మాటలకు, నిజాయితీకి మధ్య ఉన్న తేడా అమెరికా ప్రజలకు తెలుసని అన్నారు.ఏళ్ల తరబడి చర్చించుకుంటూనే ఉన్నామని, ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీలోని వారు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.చివరగా “నా మిత్రులారా! అమెరికాలో మళ్లీ ఒక కొత్త ఉదయం ప్రారంభమైంది!” అంటూ ప్రసంగాన్ని ముగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments