హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై బైక్‌తో ప్రయాణించిన ఓ వ్యక్తిని రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్ నుంచి టీఎస్‌పీఏ జంక్షన్ వైపు బైక్ నడిపిన పోలీసులు.. అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓఆర్ఆర్‌పై బైక్‌లు, స్కూటర్లు, ఆటో రిక్షాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, నో ఎంట్రీ, ప్రమాదకర డ్రైవింగ్ తదితర అంశాలపై మొత్తం రూ.1,635 చలాన్ విధించారు.


