తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు పెరుగుతున్న నేపథ్యంలో విజయ బ్రాండ్ వంట నూనెల ఉత్పత్తిని పెంచెందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ శివారు శివరాంపల్లిలో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో రూ.27 కోట్ల వ్యయంతో మెగా ఆయిల్ ప్యాకేజింగ్ ప్లాంట్ నిర్మిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 34 వేల టన్నులుగా ఉన్న విజయ నూనెల ఉత్పత్తిని వచ్చే ఏడాది 60 వేల టన్నులకు పెంచాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. పామాయిల్ రిఫైనరీలు అందుబాటులోకి వస్తే ఉత్పత్తి లక్ష టన్నులకు చేరే ఛాన్సుంది.


