HomeVideosహృదయాన్ని హత్తుకునే ‘మనసా వాచా’.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ సాంగ్ చూశారా!

హృదయాన్ని హత్తుకునే ‘మనసా వాచా’.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ సాంగ్ చూశారా!

‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.నాగవంశీ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ‘మనసా వాచా’ అనే పాట విడుదలైంది. ప్రేమ, విరహం, అనురాగం వంటి సున్నితమైన భావోద్వేగాలను హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించే ఈ గీతం విశేషంగా ఆకట్టుకుంటోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాటను కె.ఎస్. చిత్ర, ఎస్.పి. చరణ్ కలిసి ఆలపించారు. శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించారు. ఈ పాటను మీరూ చూసేయండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments