భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్నో రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నారు. స్టార్ ఓపెనర్‌గా బరిలోకి దిగే స్మృతి అలవోకగా పరుగులు చేస్తారు. స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్లో అగ్రస్థానానికి చేరుకోవడం వెనుక ఎవరికీ తెలియని ఏళ్ల శ్రమ, తిరుగులేని క్రమశిక్షణ ఉన్నాయి. మెన్స్ టీమ్‌లో కోహ్లీ ఎంత ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇస్తారో.. అమ్మాయిల క్రికెట్లో స్మృతి మంధాన టాప్ ప్లేసులో ఉన్నారు.
తాజాగా ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్ షో ‘ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ’ (Figuring Out with Raj Shamani)లో పాల్గొన్న మంధాన, తన చిన్ననాటి కఠినమైన ఫిట్నెస్ షెడ్యూల్, ఆటపై దృష్టి పెట్టిన విధానం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. స్మృతి మంధాన ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి ఓ లుక్కేద్దాం.


