అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలలు ఎగసిపడుతుండటంతో పాటు సముద్రం లోపల కూడా కోతకు గురైంది. ఇటీవల కాలంలో పర్యాటకుల బీచ్‌గా ఫేమస్ అయిన చీరాల బీచ్‌లో పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఆదివారం టూరిస్టులను అనుమతించలేదు. పొట్టిసుబ్బయ్యపాలెం కాలువ వద్ద నుంచి కఠారిపాలెం వరకూ సుమారు రెండు కిలోమీటర్ల పొడవున 20 మీటర్ల మేర సముద్రంలో కోత ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. గజ ఈతగాళ్లతో తీరం వెంట గస్తీ ఏర్పాటు చేయించి, పర్యాటకులను అనుమతించకుండా చేశారు.
సముద్రంలో అలజడి.. ఎగసిపడుతున్న అలలు.. కోతకు గురైన చీరాల తీరం
RELATED ARTICLES


