HomeLifestyleశరీరంలో ప్రోటీన్ లోపిస్తే కనిపించే మొదటి లక్షణాలు, ఆహారంలో ప్రోటీన్ పెంచుకోవడానికి ఎక్స్‌పర్ట్ చెప్పిన చిట్కాలు!

శరీరంలో ప్రోటీన్ లోపిస్తే కనిపించే మొదటి లక్షణాలు, ఆహారంలో ప్రోటీన్ పెంచుకోవడానికి ఎక్స్‌పర్ట్ చెప్పిన చిట్కాలు!

మనిషి శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఎన్నో పోషకాలు అవసరం. పోషకాలు కేవలం ఆకలిని నివారించడమే కాదు. అవి శరీర పెరుగుదల, మరమ్మత్తు, కండరాల నిర్మాణానికి అత్యవసరం. అలాంటి వాటిలో ప్రోటీన్ అత్యంత ముఖ్యమైంది. కండరాల దృఢత్వానికి, రోగనిరోధక శక్తికి, శరీర కణజాలాల మరమ్మత్తుకు అలాగే హార్మోన్లు, ఎంజైమ్‌ల విడుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యం.

​ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే నిరంతర అలసట, నీరసం, కండరాల బలహీనత, తరచూ ఆకలి వేయడం, వ్యాయామం లేదా శారీరక శ్రమ తర్వాత త్వరగా కోలుకోలేకపోవడం, క్రమంగా కండరాల పరిమాణం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావొచ్చు కాబట్టి వీటిని కేవలం ప్రోటీన్ లోపంగానే నిర్ధారించలేము. అసలు ఒక వ్యక్తికి రోజూ ఎంత ప్రోటీన్ అవసరం? ప్రోటీన్ లోపం లక్షణాలు, డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి అన్న ప్రశ్నలకు డాక్టర్ సుజాత స్టీఫెన్ (చీఫ్ డైటీషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) సమాధానం ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments