Seva First Innovation Challenge 2026: నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను పరిష్కరించే విధంగా మీ దగ్గర ఆచరణాత్మకమైన ఆలోచన ఉందా? అయితే, మీరు కేంద్ర విద్యా శాఖ చేపట్టిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొత్తం రూ.5.40 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. మూడు కేటగిరీల్లో విద్యార్థులు, యువ ఆవిష్కర్తలు ఇందులో పాల్గొనవచ్చు. అక్టోబర్ 24వ తేదీలోపు సేవా ఫస్ట్ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సేవా ఫస్ట్ ఛాలెంజ్ గురించిన వివరాలు తెలుసుకుందాం.


