మహారాష్ట్రలో దీపావళి సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. అన్ని పాఠశాలలకు నవంబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు మొత్తం 13 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. నవంబర్ 16 నుంచి రెండో సెమిస్టర్ తరగతులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ధనత్రయోదశి, దీపావళి పాడ్వా, భాయీ దూజ్ వంటి పండుగలు ఈ సెలవుల్లోనే రానున్నాయి. మొదటి సెమిస్టర్ అక్టోబర్ 31తో ముగియనుండగా.. రెండో సెమిస్టర్ వచ్చే ఏడాది మే 1 వరకు కొనసాగుతుంది. మే 3 నుంచి జూన్ 14 వరకు వేసవి సెలవులు ఉంటాయి. పాఠశాలలు ఏడాదిలో 76 రోజుల సెలవుల పరిమితిని పాటిస్తూ కనీసం 230 పనిదినాలను పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. దీపావళి పండగకు 13 రోజులు సెలవులు
RELATED ARTICLES


