Vijayawada High Tension In Saap Office: విజయవాడలోని శాప్ కార్యాలయం హైడ్రామా కనిపించింది. మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్‌ను కలిసేందుకు వచ్చారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు శాప్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. స్పోర్ట్స్ కోటా టీచర్లు వాటిని ఖండిస్తూ పోటాపోటీగా నినాదాలు చేశారు..దీంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది.


