తిరువనంతపురంలో వెస్టిండీస్‌పై 9 సిక్సర్లతో 88 బంతుల్లో 139 పరుగులు బాది, 15,000 వన్డే పరుగుల మైలురాయిని దాటిన విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. కెరీర్లో ఈ దశలో తనలోని కొత్త వెర్షన్‌ను అన్‌లాక్ చేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని పేర్కొన్నాడు. ఫిట్నెస్ వల్లే స్వేచ్ఛగా ఆడగలుగుతున్నానని, దీన్నే కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. దేశం తరఫున ఆడుతున్నందుకు నిరంతరం కృతజ్ఞతతో ఉంటానని కోహ్లీ తెలిపాడు. యువ క్రికెటర్లకు కీలక సూచన చేశాడు.


