HomeAndhra Pradeshలక్ష కోట్ల డ్రామాలు.. బాబువన్నీ పిట్టలదొర మాటలే : సీఎం చంద్రబాబుపై జగన్...

లక్ష కోట్ల డ్రామాలు.. బాబువన్నీ పిట్టలదొర మాటలే : సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు

లక్ష కోట్ల డ్రామాలు..  బాబువన్నీ పిట్టలదొర మాటలే :  సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
సీఎం చంద్రబాబునాయుడుపై.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ మండిపడ్డారు. రాయలసీమలో హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కోసం ఏకంగా రూ. లక్ష కోట్లు కేటాయిస్తామంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. చంద్రబాబువన్నీ పిట్టలదొర మాటలేనని X వేదకగా ధ్వజమెత్తారు. రాయలసీమలో ప్రస్తుతం తీవ్రమైన దుర్భిక్షం ఉందని, ఈ వాస్తవాన్ని పక్కనపెట్టి కూటమి ప్రభుత్వం ‘హార్టికల్చర్ హబ్’ల పేరుతో పబ్లిసిటీ డ్రామాలు ఆడుతోందని ఎద్దేవా చేశారు. అక్కడ రైతులు ప్రస్తుతం నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ అవస్థలను చంద్రబాబునాయుడు పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments