ముఖానికి మాయిశ్చరైజర్ రాస్తే చర్మం సాఫ్ట్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది అనేది నిజమే. అందుకే చాలామంది ఉదయం, రాత్రి స్కిన్‌కేర్ రొటీన్లో మాయిశ్చరైజర్‌ను తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో కనిపించే ప్రతి మాయిశ్చరైజర్ ప్రతి ఒక్కరి చర్మానికి సరిపోదు. మన స్నేహితుడికి లేదా కుటుంబ సభ్యుడికి బాగా సరిపోయిన క్రీమ్ మన చర్మానికి కూడా సరిపోతుందని అనుకోవడం సరైంది కాదు. ఒకరికి బాగా పనిచేసిన క్రీమ్ మరొకరి ముఖంపై జిడ్డుగా అనిపించవచ్చు.
ఇంకొందరికి క్రీమ్ రాసిన తర్వాత కూడా చర్మం పొడిబారడం, బిగుతుగా అనిపించడం లేదా చికాకు రావచ్చు. చర్మం ఆయిలీగా ఉందా, డ్రైగా ఉందా లేదా రెండింటి కాంబినేషన్ స్కిన్నా అనే దాన్ని బట్టి మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. అయితే మీ చర్మానికి ఏ పదార్థం, ఏ ఫార్ములా సరిపోతుందనేది తెలుసుకోవడం మరింత ముఖ్యం. మరి మీ చర్మ రకాన్ని బట్టి ఎలాంటి మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి? ఏ ఇంగ్రిడియెంట్స్ ఉండేలా చూసుకోవాలి? వంటి వివషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..


