గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ 165 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. 372 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, రెండో ఇన్నింగ్స్లో కేవలం 206 పరుగులకే కుప్పకూలింది. ఈ అద్భుత విజయంతో రెండు టెస్టుల సిరీస్లో టీమిండియా 1-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆగస్టు 23 నుంచి కొలంబోలో భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.


