మలవిసర్జన తర్వాత మీకు మంట అనిపిస్తోందా? మలవిసర్జన చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తోందా? మంటతో పాటు నొప్పిగా కూడా ఉందా? మలవిసర్జన తర్వాత మంట సమస్య సాధారణంగా పైల్స్ కారణంగా రావచ్చు. కానీ ఇది కాకుండా ఈ సమస్య రావడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. మలవిసర్జన తర్వాత మంట సమస్యను నిర్లక్ష్యం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. చాలా మంది సిగ్గుపడి ఈ సమస్యను చెప్పుకోరు.
అసలు మలవిసర్జన తర్వాత మంట రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? సాధారణ మంటకు.. పైల్స్ లేదా ఫిషర్స్కు తేడాను ఎలా గుర్తించాలి? తక్షణ ఉపశమనం కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఇలా అనేక సందేహలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి (సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపాటాలజిస్ట్ అండ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్). ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


