TDP Janasena Party Alerts Social Media Warriors And Janasainiks: కూటమిలో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ, జనసేన పార్టీలు స్పందించాయి. సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీల కార్యకర్తల పోస్టులపై కీలక అంశాలను ప్రస్తావించారు. ఒకరిపై మరొకరు పోస్టులు పెట్టడంతో పాటుగా ఇరు పార్టీలకు చెందిన పెద్దలు, వారి కుటుంబాలపై అభ్యంతకరంగా పోస్టులు పెట్టడం సరికాదన్నారు. టీడీపీ, జనసేన పార్టీల కేడర్ సంయమనం పాటించాలని సూచించారు.


