ఇటీవల బంగ్లాదేశ్‌కు చెందిన ఓ జంటకు సౌదీ అరేబియా మరణ శిక్ష అమలు చేసింది. మక్కాలోని ఓ మసీదులో వీరు అశ్లీల చర్యలకు పాాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఇస్లామిక్ చట్టాల ప్రకారం శిక్ష ఖరారు చేసింది. అయితే, ఈ జంట చేసిన నేరం ఏంటి? అనేది స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేదని పేర్కొంది. దీంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


