మనలో చాలా మందికి భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం అలవాటు ఉంటుంది. అయితే, భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల గ్యాస్ వల్ల పొట్ట ఉబ్బుతుందని నమ్ముతారు. అసలు భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం మంచిదేనా? అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ ప్రశ్నకి సమాధానమిచ్చారు డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి (సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ & థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్).
డాక్టర్ ప్రకారం చాలామందికి భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం వల్ల ఎలాంటి హానీ జరగదు. భోజనం తర్వాత పండ్లు తింటే అవి కడుపులోనే పులిసిపోతాయని (fermentation), కుళ్లిపోతాయని ప్రచారంలో ఉన్న వార్తలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే మనం తీసుకునే ఆహార పరిమాణం, పండ్ల రకాన్ని బట్టి కొంతమందికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అసలు పండ్లు తినడానికి బెస్ట్ టైమ్, భోజనం తర్వాత ఎంతసేపు ఆగాలి అన్న విషయాలపై పూర్తి వివరాల్ని డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.


