HomeTELANGANAబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్.. గడువు పొడిగింపు, ఈనెల 31 వరకు దరఖాస్తులు

బీసీ విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్.. గడువు పొడిగింపు, ఈనెల 31 వరకు దరఖాస్తులు

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణ బీసీ, ఈబీసీ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా మరో అవకాశం లభించింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ఈనెలాఖరు వరకు పొడిగించారు. కుటుంబ వార్షిక ఆదాయం, వయోపరిమితి, డిగ్రీ మార్కులు, విదేశీ విద్యకు అవసరమైన ప్రవేశ పరీక్షలు, ఆంగ్ల భాషా పరీక్షల స్కోర్లు వంటి అర్హతలను అభ్యర్థులు పరిశీలించాలి. అర్హులైన విద్యార్థులు తెలంగాణ ఈ-పాస్ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీకి ముందే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments