ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించేందుకు ఎస్ఐఆర్ను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం నిర్ణయాల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతూ సీఈసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. ఓటర్ల జాబితాల సవరణలో మరణాలు, నివాస మార్పులు, నకిలీ నమోదులు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.


