సాధారణ స్పీడ్తో చేసే వర్కౌట్లా కాకుండా, HIIT పదేపదే కష్టమైన వర్కౌట్తో కూడిన బ్రేక్స్ తీసుకుంటూ చేయడం అనేది బరువు తగ్గడానికి, బాడీలోని ఫ్యాట్ తగ్గడానికి హెల్ప్ చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, కండరాలని, హృదయనాళ వ్యవస్థని సవాలు చేస్తుంది. ఇది కొవ్వుని తగ్గిస్తూనే బాడీ లీన్ కణజాలాన్ని కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అయితే, ఫలితాలు అనేవి ఓ వ్యక్తి వయసు, ఫిట్నెస్ లెవల్స్, ఫుడ్, మొత్తం ఆరోగ్యంపై కూడా ఉంటాయని చెబుతున్నారు డాక్టర్ శ్రీకాంత్ లడ్డిపెర్ల((పిటి, పిహెచ్డి స్కాలర్), హెచ్ఓడి, ఫిజియోథెరపీ విభాగం, యశోద హాస్పిటల్స్, హైటెక్సిటి, హైదరాబాద్).


