మెగాస్టార్ చిరంజీవి మాస్ మేనియాకు తిరుగులేని నిదర్శనంగా నిలిచిన ఆల్-టైమ్ బ్లాక్బస్టర్ ‘రౌడీ అల్లుడు’ నేటితో విజయవంతంగా 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1991 అక్టోబర్ 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇందులో పారిశ్రామికవేత్త కళ్యాణ్, ముంబై ఆటో డ్రైవర్ జానీగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా ఆటో జానీ పలికించిన “బాక్సు బద్దలైపోద్ది” అనే మేనరిజం థియేటర్లలో ఈలల వర్షం కురిపించింది. బప్పి లహరి అందించిన చార్ట్బస్టర్ సాంగ్స్, శోభన-దివ్యభారతిల గ్లామర్, బ్రహ్మానందం కామెడీ సినిమాను పర్ఫెక్ట్ ఎంటర్టైనర్గా నిలిపాయి.
బాక్సాఫీస్ ‘బాక్సులు బద్దలు’ కొట్టిన ఆటో జానీ.. చిరంజీవి మెగా బ్లాక్బస్టర్ ‘రౌడీ అల్లుడు’కి 35 ఏళ్లు
RELATED ARTICLES


