ఫేస్బుక్లో చేసిన కామెంట్ వివాదంలో మరణశిక్ష పడిన శ్రీలంక వలస కార్మికుడు అనోజన్ శివరాసకు ఊరట లభించింది. ఆయనపై విధించిన మరణశిక్షను సౌదీ అరేబియా సుప్రీంకోర్టు రద్దు చేసినట్లు శ్రీలంక డిప్యూటీ విదేశాంగ మంత్రి అరుణ్ హేమచంద్ర వెల్లడించారు. అయితే సుప్రీంకోర్టు మరణశిక్షను రద్దు చేసినప్పటికీ.. శివరాసపై తదుపరి న్యాయపరమైన చర్యలు ఏవిధంగా ఉంటాయి, ఆయన ఇంకా ఎంతకాలం కస్టడీలో ఉండాల్సి వస్తుంది అనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
ఫేస్బుక్లో మహమ్మద్ ప్రవక్తను కించపరిచే కామెంట్.. మరణశిక్ష విధించి మళ్లీ యూటర్న్ తీసుకున్న సౌదీ సుప్రీం కోర్టు
RELATED ARTICLES


