ఫెయిర్నెస్ క్రీమ్స్.. బ్యూటీ ప్రోడక్ట్స్లో వీటికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈక్రీమ్స్ చర్మంపై నలుపుని తగ్గించి కాంతివంతంగా మారుస్తాయని చాలా మంది వీటిని వాడుతుంటారు. మౌత్ పబ్లిసిటీ నుంచి టీవి ఆన్ చేస్తే యాడ్స్ వరకూ వీటి గురించి ఊదరగొడుతూనే ఉంటారు. దీంతో వాడాలనే ఉద్దేశ్యం లేనివారు కూడా ఒక్కసారి వాడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దామని వీటిని వాడతారు. అయితే, వీటిని వాడితే నిజంగానే స్కిన్ కాంతివంతంగా మారుతుందా, దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇలాంటి విషయాలన్నింటినీ డాక్టర్ అంబికా కుమార్(కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, స్పర్శ్ హాస్పిటల్ యశ్వంత్పూర్) మాటల్లో తెలుసుకుందాం.


